నిజరూపంలో భ్రమరాంబ దర్శనం
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:05 AM
శ్రీశైల క్షేత్రంలో దసరా శరన్నవరాత్రిమహోత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం విజయదశమి సందర్భంగా తెల్లవారుజామున అమ్మవారికి మండపారాధన, జపానుష్ఠానాలు, కళశోద్వాసన, విశేష కుంకుమార్చన, సహస్ర చండీ, మహా రుద్ర హోమాలను నిర్వహించారు.
శ్రీశైలంలో ముగిసిన దసరా మహోత్సవాలు
శ్రీశైలం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో దసరా శరన్నవరాత్రిమహోత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం విజయదశమి సందర్భంగా తెల్లవారుజామున అమ్మవారికి మండపారాధన, జపానుష్ఠానాలు, కళశోద్వాసన, విశేష కుంకుమార్చన, సహస్ర చండీ, మహా రుద్ర హోమాలను నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. మల్లికా గుండంలో చండీశ్వరునికి అవబృథ స్నానం జరిపించి అలంకార మండపంలో చతుర్వేద గోష్టి నిర్వహించారు. సాయంత్రం అమ్మవారు భ్రమరాంబదేవి నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహోత్సవాల్లో చివరి రోజున స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ, శమీ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో తెప్పపై స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవాన్ని నిర్వహించారు.
ఈ వార్తలనూ చదవండి