Share News

శ్రీశైలంలో ఘనంగా కార్తీక జ్వాలాతోరణం

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:57 AM

శ్రీశైలంలో మంగళవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన గోపురం వద్ద జ్వాలా తోరణం నిర్వహించారు.

శ్రీశైలంలో ఘనంగా కార్తీక జ్వాలాతోరణం

శ్రీశైలం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో మంగళవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన గోపురం వద్ద జ్వాలా తోరణం నిర్వహించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి దంపతులు, ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ పోతుగుంట రమేశ్‌నాయుడు ప్రదోషకాల పౌర్ణమి ఘడియల్లో జ్వాలా తోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 01:06 AM