శ్రీగిరిపై కోటి దీపోత్సవం
ABN , Publish Date - Nov 21 , 2026 | 06:48 AM
శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శుక్రవారం కార్తీక ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. ఆలయం ఆధ్వర్యంలో భక్తులు కోటి దీపోత్సవాన్ని నిర్వహించడంతో శ్రీశైలం కైలాసాన్ని తలపించింది.
ఆది దంపతులకు కార్తీక ఏకాదశి పూజలు
శ్రీశైలం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శుక్రవారం కార్తీక ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. ఆలయం ఆధ్వర్యంలో భక్తులు కోటి దీపోత్సవాన్ని నిర్వహించడంతో శ్రీశైలం కైలాసాన్ని తలపించింది. ఈసందర్భంగా క్షేత్ర పరిధిలోని దేవస్థాన ఆగమ పాఠశాల ఎదుట మైదానంలో కైలాస పర్వతం నమూనా భక్తులను మంత్రముగ్దులను చేసింది. సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేదికపై ఆశీనులజేసి ఆలయ ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యుల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన భక్తుజనుల పంచాక్షరీ మంత్రంతో కోటి దీపోత్సవ ప్రాంగణం మార్మోగిపోయింది. కార్యక్రమంలో భాగంగా సినీ నేపథ్య గాయకుడు మనో బృందం భక్తి పాటలు భక్తులను అలరించాయి..
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి