Share News

ఉగ్ర కుట్రకు ప్రత్యేక యాప్‌

ABN , Publish Date - Sep 20 , 2026 | 03:59 AM

విజయవాడలో వెలుగుచూసిన ఉగ్రవాద కుట్రపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణ కీలక దశకు చేరుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌ ఐసి్‌సతో సంబంధాలు ఉన్నాయంటూ అరెస్టుచేసిన తొమ్మిది మందిపై విజయవాడ ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ శనివారం చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

ఉగ్ర కుట్రకు ప్రత్యేక యాప్‌

  • విజయవాడ టెర్రర్‌ లింక్‌ కేసులో కీలక పురోగతి

  • 9 మంది నిందితులపై ఎన్‌ఐఏ అభియోగ పత్రం

  • ప్రత్యేక యాప్‌ ద్వారా ఉగ్ర సమాచార మార్పిడి

  • జిహాదీ కార్యకలాపాలకు ఇన్‌స్టా, టెలిగ్రామ్‌ వినియోగం

విజయవాడ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో వెలుగుచూసిన ఉగ్రవాద కుట్రపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణ కీలక దశకు చేరుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌ ఐసి్‌సతో సంబంధాలు ఉన్నాయంటూ అరెస్టుచేసిన తొమ్మిది మందిపై విజయవాడ ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ శనివారం చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దేశంలో ఉగ్ర భావజాలం వ్యాప్తి, నెట్‌వర్క్‌ విస్తరణ కోసం ప్రత్యేక యాప్‌ను నిందితులు వినియోగించినట్టు అందులో తెలిపింది. పోలీసుల కంటపడకుండా, నిఘా వర్గాలు తమ సమాచారాన్ని కనిపెట్టకుండా ఉండేందుకు నిందితులు ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ యాప్‌ను సొంతంగా అభివృద్ధి చేసుకున్నారని పేర్కొంది. ఈ యాప్‌ ద్వారానే ఒకరికొకరు రహస్యంగా మెసేజ్‌లు, ప్లాన్‌లు బదిలీ చేసుకునేవారని వివరించారు.

ఈ కేసులో 11 మంది నిందితులతోపాటు, ఓ మైనర్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిపై బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్లతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక(ఉపా), ఐటీ చట్టాల కింద కఠినమైన అభియోగాలు మోపింది. ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడిన ప్రమాదకర ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ సిద్ధాంతాలను భారత్‌లో బలంగా ప్రచారం చేయడానికి ఈ ముఠా ఆన్‌లైన్‌ వేదికలను ఎంచుకుందని చార్జిషీటులో ఎన్‌ఐఏ తెలిపింది. అమాయకులైన యువకులను ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా టార్గెట్‌ చేశారని వివరించింది. భారత్‌లో ఇస్లాం రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా హింసాత్మక జిహాద్‌ వైపు రెచ్చగొట్టేందుకు ప్రణాళిక రచించారని పేర్కొంది. దీనికోసం పేలుడు పదార్థాల తయారీ, ఆయుధ శిక్షణకు తెగించారని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి...

విశాఖకు గోదావరి జలాలు

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిధి పెంపు

Updated Date - Sep 20 , 2026 | 03:59 AM