అపర భగీరధుడు చంద్రబాబు
ABN , Publish Date - Sep 20 , 2026 | 01:14 AM
సీఎం చంద్రబాబు అపర భగీరధుడని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మధుసూదన్‌నాయుడు కొనియాడారు.
పుంగనూరు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు అపర భగీరధుడని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మధుసూదన్‌నాయుడు కొనియాడారు. మండలంలోని ఏటవాకిలి పంచాయతీ ప్రసన్నయ్యగారిపల్లె వద్ద హంద్రీనీవా కాల్వ ద్వారా వచ్చిన కృష్ణా జలాలకు శనివారం వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసి, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను గుర్తించిన సీఎం హంద్రీనీవా కాల్వ ద్వారా నీటిని వదలడం సంతోషించదగ్గ విషయమన్నారు. గత ప్రభుత్వం ఈ విషయంలో కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శమిపతి యాదవ్, బోయకొండ మాజీ చైర్మన్ ఎస్‌కే రమణారెడ్డి, సోమల సురేశ్, మధుసూదన్ రాయల్, సుబ్రహ్మణ్యంరాజు, నాగరాజాచారి, శివకుమార్, శివకుమార్ నాయుడు, ఆసూరి బాలాజీ, దేశాది ప్రకాశ్, మోహన్‌రెడ్డి, సుహేల్‌బాషా, ఇబ్రహీం, చంద్ర, ప్రసాద్, గిరిబాబునాయుడు, నూరు, గంగాధర్ నాయుడు, కేశవమూర్తి తదితరులు పాల్గొన్నారు.