‘నైరుతి’ నిష్క్రమణ ప్రారంభం
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:02 AM
దేశంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. పశ్చిమ రాజస్థాన్ నుంచి రుతుపవనాలు శనివారం నిష్క్రమించాయి.
దేశంలో 15 శాతం లోటు వర్షపాతం
విశాఖపట్నం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): దేశంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. పశ్చిమ రాజస్థాన్ నుంచి రుతుపవనాలు శనివారం నిష్క్రమించాయి. ఈ ఏడాది జూన్ నాలుగో తేదీన కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు జూలై 9 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఎల్‌నినో ప్రభావంతో జూలై తప్ప మిగిలిన మూడు నెలల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటి నుంచి ఇప్పటి(శనివారం) వరకు దేశంలో 817.2 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 695.6 మి.మీ. మాత్రమే(సాధారణం కంటే 15 శాతం తక్కువ) వర్షపాతం నమోదైంది. దక్షిణాదిలో 28 శాతం, తూర్పు, ఈశాన్య భారతాల్లో 26 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ఇది ఖరీ్‌ఫపంటలపై తీవ్ర ప్రభావం చూపింది.
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు