అర గంటలోపు లక్షణాలు కనిపిస్తాయి
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:07 AM
పాము కాటేసిన చోట లక్షణాలు పావుగంట నుంచి అరగంట లోపు ప్రభావం కనిపి స్తుందని డీఎంహెచవో డా.కామేశ్వర ప్రసాద్ తెలిపారు.
డీఎంహెచవో డాక్టర్ కామేశ్వర ప్రసాద్
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పాము కాటేసిన చోట లక్షణాలు పావుగంట నుంచి అరగంట లోపు ప్రభావం కనిపి స్తుందని డీఎంహెచవో డా.కామేశ్వర ప్రసాద్ తెలిపారు. శనివారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న క్షేత్ర స్థాయి పర్యవేక్షకుల సమీక్ష సమావేశానికి డీఎంహె చవో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రపంచ పాము కాటు అవగాహన దినోత్సవం సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడు తూ పాము కాటు వేసిన వ్యక్తికి ధైర్యం చెప్పాలని, విషయం వ్యాపించ కుండా రోగిని కింద పడుకోబెట్టాలని సూచించారు. పాముకాటుకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో (పీహెచసీ, అర్బన హెల్త్ సెంటర్, సీహెచసీ) యాంటి వీనమ్ మందు అందుబాటులో ఉందన్నారు. నాటు వైద్యులను, మంత్రగాళ్లను నమ్మవద్దని, ప్రతి 108 వాహనంలో యాంటి స్నేక్ వీనమ్ ఉందన్నారు. ఫారెస్టు ఆఫీసర్ ప్రియాంకరెడ్డి మాట్లాడుతూ 2500 రకాలున్న పాములు ఉన్నాయని, అందులో కొన్నిరకాల పాములు విషపూ రితంగా ఉన్నాయన్నారు. ఎక్కడైనా పాములు కనపడితే 81143148320 నెంబరుకు ఫోన చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఐవో డా.ఉమా, సంచార చికిత్స కార్యక్రమ నోడల్ ఆఫీసర్ డా.విశ్వేశ్వరరెడ్డి, డెమో ప్రకాష్ రెడ్డి, ఎపీడమాలజిస్టు వేణుగోపాల్, చలపతి పాల్గొన్నారు.