Share News

చెట్టులెక్కగలను... వీడియో గేములాడగలను...!

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:04 AM

చెట్టులెక్కగలను... పుట్టలెక్కగలను... చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన నిలుచుని గేములాడగలను..! వీడియో గేములాడగలను..!! అని పాడుకునేట్టు ఉంది కదా ఈ చిత్రం. ఇప్పటి వరకూ ఉద్యోగులు హాజరు కోసం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల బయోమెట్రిక్‌ వేసేందుకు సిగ్నల్‌ రాక చెట్టులు ఎక్కే చిత్రాలు చూశాం. ఇదీ ఆ కోవలోదే.

చెట్టులెక్కగలను... వీడియో గేములాడగలను...!

చెట్టులెక్కగలను... పుట్టలెక్కగలను... చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన నిలుచుని గేములాడగలను..! వీడియో గేములాడగలను..!! అని పాడుకునేట్టు ఉంది కదా ఈ చిత్రం. ఇప్పటి వరకూ ఉద్యోగులు హాజరు కోసం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల బయోమెట్రిక్‌ వేసేందుకు సిగ్నల్‌ రాక చెట్టులు ఎక్కే చిత్రాలు చూశాం. ఇదీ ఆ కోవలోదే. ఇక్కడ నేలపై సిగ్నల్స్‌ రాక యువత చెట్టులెక్కి సెల్‌ఫోనులో గేములాడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో కనిపించిందీ దృశ్యం. ఇక్కడి తుంభకొండ గ్రామంలో సెల్‌సిగ్నల్స్‌ సరిగా అందకపోతుండడంతో పిల్లలు, యువత ఇలా చెట్టులెక్కి సెల్‌ఫోనుల్లో వీడియో గేములాడుతున్నారు. ప్రమాదకరంగా చెట్లపై నిలబడి సెల్‌ఫోనులో తలలు పెట్టేసి... వీడియో గేముల్లో నిమగ్నపోయారు.

- సీతంపేట, ఆంధ్రజ్యోతి

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 05:04 AM