Share News

అమరావతిలో ‘సింగపూర్‌’ ఇంటర్నేషనల్‌ స్కూల్‌!

ABN , Publish Date - Sep 19 , 2026 | 04:45 AM

రాజధాని అమరావతిలో మరో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అందుబాటులోకి రానుంది. సింగపూర్‌కు చెందిన గ్లోబల్‌ స్కూల్‌ గ్రూప్‌ (జీఎస్‌జీ) క్యాంపస్‌ నిర్మాణం కోసం ఇప్పటికే స్థలాన్ని కూడా ఖరారు చేశారు. ఈ సంస్థ 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా చైర్మన్‌ అతుల్‌ తెముర్నీకర్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

అమరావతిలో ‘సింగపూర్‌’ ఇంటర్నేషనల్‌ స్కూల్‌!

గ్లోబల్‌ స్కూల్‌ గ్రూప్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు స్థలం ఖరారు

సింగపూర్‌, సెప్టెంబరు 18: రాజధాని అమరావతిలో మరో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అందుబాటులోకి రానుంది. సింగపూర్‌కు చెందిన గ్లోబల్‌ స్కూల్‌ గ్రూప్‌ (జీఎస్‌జీ) క్యాంపస్‌ నిర్మాణం కోసం ఇప్పటికే స్థలాన్ని కూడా ఖరారు చేశారు. ఈ సంస్థ 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా చైర్మన్‌ అతుల్‌ తెముర్నీకర్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 24కు పైగా కొత్త జీఎ్‌సజీ క్యాంప్‌సలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ క్యాంప్‌సల నిర్మాణం కోసం దాదాపు రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంవోయూలు కూడా కుదిరినట్లు చెప్పారు. ఎక్కువ శాతం పాఠశాలలను టైర్‌-1 నగరాల్లోనూ, మరికొన్నింటిని ప్రధాన నగరాలకు సమీపంలో ఉండే టైర్‌-2 నగరాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ఆసియాలోని 11 దేశాల్లో 60కి పైగా క్యాంప్‌సలను నిర్వహిస్తున్న జీఎ్‌సజీ... 2011 నుంచి దేశంలో 20కి పైగా పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌, నోయిడా, అహ్మదాబాద్‌, ముంబై, పుణె, బెంగళూరు, మదురైలతో ఈ సంస్థకు చెందిన పాఠశాలలు ఉన్నాయి.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 04:45 AM