ఉత్సాహంగా ఈఎంఆర్‌ఎస్ ఆటల పోటీలు
ABN , Publish Date - Sep 18 , 2026 | 11:12 PM
క్లస్టర్ ఈఎంఆర్‌ఎస్ స్పోర్ట్స్ మీట్ రెండో రోజు శుక్రవారం పలు ఆటల పోటీలు ఉత్సాహంగా సాగాయి.
ప్రతిభ చాటిన బాలుర, బాలికలు
అరకులోయ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): క్లస్టర్ ఈఎంఆర్‌ఎస్ స్పోర్ట్స్ మీట్ రెండో రోజు శుక్రవారం పలు ఆటల పోటీలు ఉత్సాహంగా సాగాయి. అరకులోయ గురుకుల క్రీడా పాఠశాల మైదానంలో శుక్రవారం హ్యాండ్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్‌బాల్, చెస్ పోటీలలో 9 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర అండర్-19కు సంబంధించిన ఆటల పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. హ్యాండ్‌బాల్‌లో విన్నర్స్‌గా పెదబయలు విద్యార్థులు నిలువగా.. రన్నర్స్‌గా అరకులోయ విద్యార్థులు నిలిచారు. వాలీబాల్ పోటీలో విన్నర్స్‌గా చింతపల్లి విద్యార్థులు.. రన్నర్స్‌గా పెదబయలు విద్యార్థులు నిలిచారు. కబడ్డీలో విన్నర్స్‌గా చింతపల్లి విద్యార్థులు నిలవగా.. రన్నర్స్‌గా జీకే.వీధి విద్యార్థులు నిలిచారు. ఖోఖోలో విన్నర్స్‌గా పెదబయలు విద్యార్థులు.. రన్నర్స్‌గా జీకేవీధి విద్యార్థులు నిలిచారు. బాస్కెట్‌బాల్‌లో విన్నర్స్‌గా రాజవొమ్మంగి విద్యార్థులు.. రన్నర్స్ హుకుంపేట విద్యార్థులు నిలిచారు. చెస్‌లో రాజవొమ్మంగి పాఠశాలకు చెందిన ప్రణీత్‌కుమార్ ప్రథమ స్థానంలో నిలువగా.. రెండో స్థానంలో అదే పాఠశాలకు చెందిన కె.కన్నబాబు నిలిచారు.
బాలికల విభాగంలో విజేతలు
బాలికల అండర్-19 విభాగంలో బాస్కెట్‌బాల్‌లో విన్నర్స్‌గా రాజవొమ్మంగి, రన్నర్‌గా జీకేవీధి విద్యార్థులు నిలిచారు. వాలీబాల్‌లో విన్నర్స్‌గా జీకేవీధి, రన్నర్‌గా హుకుంపేట, కబడ్డీలో విన్నర్స్‌గా చింతపల్లి, రన్నర్‌గా హుకుంపేట, హ్యాండ్‌బాల్‌లో విన్నర్స్‌గా జీకేవీధి, రన్నర్‌గా పెదబయలు విద్యార్థులు నిలిచారు. చెస్‌లో విన్నర్‌గా జీకేవీధి పాఠశాలకు చెందిన వి.భూమిక, రన్నర్‌గా హుకుంపేటకు చెందిన వి.మహిప్రియ, ఖోఖోలో విన్నర్స్‌గా జీకేవీధి, రన్నర్స్‌గా పెదబయలు పాఠశాల విద్యార్థులు నిలిచారు.