త్రిపురాంతకంలో దారుణం.. ప్రియురాలితో కలిసి కన్న బిడ్డని కడతేర్చిన తండ్రి
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:10 AM
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల వల్ల విచక్షణ కోల్పోయి, కన్నబిడ్డలను సైతం అత్యంత దారుణంగా హతమారుస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
మార్కాపురం,, మార్చి 27: ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల వల్ల విచక్షణ కోల్పోయి, కన్నబిడ్డలను సైతం అత్యంత దారుణంగా హతమారుస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న నెపంతో తొమ్మిదేళ్ల చిన్నారిని ప్రియురాలితో కలిసి అత్యంత క్రూరంగా హత్య చేశాడు తండ్రి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురాంతకం మండల కేంద్రానికి చెందిన శివారెడ్డి, భార్య ఈశ్వరమ్మకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు 4వ తరగతి చదువుతోంది. గత కొంత కాలంగా శివారెడ్డి బాజీబీ అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరి వ్యవహారం పెద్ద కూతురుకి తెలిసింది. దాంతో పాప అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ప్రియురాలితో కలిసి శివారెడ్డి తన కూతురుపై దాడి చేశాడు. జాలి, దయ లేకుండా ఇనుప తీగతో గొంతు బిగించి ప్రాణాలు తీశాడు.
చిన్నారి మరణవార్త తెలుసుకున్న బంధువులు, స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలియడంతో ఆగ్రహించిన బంధువుల శివారెడ్డిని పట్టుకొని చితకబాదారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు శివారెడ్డితో పాటు అతనికి సహకరించిన ప్రియురాలు బాజీబిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం ఆసుపత్రికి తరలించారు.
ఈ వార్తలూ చదవండి:
వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి 6.1 శాతమే..
15 శాతం తగ్గనున్న ఎరువుల ఉత్పత్తి