కొత్త జిల్లాలో మైనారిటీకి తొలి అవకాశం
ABN , Publish Date - Nov 21 , 2026 | 02:34 AM
నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లా తొలి జడ్పీ పీఠం ముస్లిం మైనారిటీకి దక్కింది. ఈ స్థానం జనరల్‌కు కేటాయించగా.. బనగానపల్లె జడ్పీటీసీ షేక్ బ్రుహానుద్దీన్‌కు అవకాశం దక్కడం...
నంద్యాల జడ్పీ చైర్మన్‌గా షేక్ బ్రుహానుద్దీన్
మంత్రి జనార్దన్‌రెడ్డికి క్లాస్‌మేట్
నంద్యాల, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లా తొలి జడ్పీ పీఠం ముస్లిం మైనారిటీకి దక్కింది. ఈ స్థానం జనరల్‌కు కేటాయించగా.. బనగానపల్లె జడ్పీటీసీ షేక్ బ్రుహానుద్దీన్‌కు అవకాశం దక్కడం చర్చనీయాంశమైంది. ఈయన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి చిన్ననాటి స్నేహితుడు, క్లాస్‌మేట్ కూడా. చైర్మన్ పదవికి ఆళ్లగడ్డ, వెలుగోడు జడ్పీటీసీలు పోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గుండం రమణారెడ్డి రేసులో ఉన్నారు. చివరకు మంత్రికి సన్నిహితుడైన బ్రుహానుద్దీన్‌కు అవకాశం దక్కింది. టీడీపీపై విధేయత, నాయకత్వంపై విశ్వాసం, రాజకీయంగా కలిసి వచ్చే సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని బ్రుహనుద్దీన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నూతన చైర్మన్‌ను మంత్రి జనార్దన్ రెడ్డ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి