రెండో విడతా ఉద్రిక్తం!
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:12 AM
రెండో విడత పంచాయతీ పోరు కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది
అనంతలో చెలరేగిన వైసీపీ మూకలు
రాళ్లు, కర్రలు, బీరుసీసాలు, పెట్రోబాంబులతో
బీభత్సం.. యల్లనూరులో 13 మందికి తీవ్రగాయాలు
వేటపాలెంలో ఆమంచి వర్గం వీరంగం
కాల్పుల దాకా పోయిన పోలింగ్ ఘర్షణ
(ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్)
రెండో విడత పంచాయతీ పోరు కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. అనంతపురం జిల్లా యల్లనూరు మం డల కేంద్రంలో టీడీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలో వేచి ఉండగా, సుమారు 60 మంది వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని రాళ్లు, కర్రలు, బీరు సీసాలు, పెట్రో బాం బులతో విరుచుకుపడ్డారు. టీడీపీ ఏజెంట్లపై దాడి చేశా రు. దీంతో ఆరుగురు టీడీపీ ఏజెంట్లకు తీవ్రగాయాలయ్యాయి. టీడీపీ కార్యకర్త ఆనంద్‌పై పెట్రో బాంబు విసరడంతో అతని దుస్తులకు నిప్పు అంటుకుని, గాయపడ్డా డు. బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామం లో టీడీపీ రెబల్, స్థానిక టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒక రు రాళ్లదాడులు చేసుకున్నారు. గుంతకల్లు మండలం కొంగనపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు, వేటకొడవళ్లతో దాడులు చేసుకున్నారు.
సీఐ కళ్లలో కారం చల్లి.. బంధించి..
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కలవకూరులో కౌంటింగ్‌లో టీడీపీ రెబల్ అభ్యర్థికి భారీ ఆధిక్యం వచ్చిం ది. ఆ తరువాత రెండు రౌండ్లలోనే టీడీపీ మద్దతుతో పోటీ చేసిన కఠారి పద్మాంజలి దూసుకెళ్లారు. పద్మాంజలి 30 ఓట్లతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. ఆ వెం టనే.. ఇరువర్గీయలూ దాడులకు తెగబడ్డారు. ఘర్షణను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న సీఐ ప్రభాకరరావు కళ్లలో కొందరు కారం చల్లారు. రాళ్ల దాడిలో హెడ్‌కానిస్టేబుల్ రవి, పద్మాంజలి భర్త కఠారి నాగేశ్వరరావు గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం తెలికిపెంటలో సర్పంచ్ అభ్యర్థి నందివాడ రాజ్యలక్ష్మి భర్త, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరావు తన శిబిరం సమీపంలో ఉండగా మొబైల్ పార్టీ పోలీసులు వచ్చారు. ఈ నేపథ్యం లో ఎస్‌ఐ రాము, గోవిందరావు మధ్య వాగ్వాదం జరిగిం ది. ఎస్‌ఐ లాఠీతో గోవిందరావుపై దాడి చేశారు. దీంతో గోవిందరావు తల, చేతి వేళ్ల మధ్య గాయాలయ్యాయి. అభ్యర్థుల మధ్య పాత కక్షల నేపథ్యంలో తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సి.రామాపురం పోలింగ్ కేంద్రం వద్ద పరస్పర దాడుల్లో పలువురు గాయపడ్డారు. రణధీర్‌పురం పంచాయతీ 1, 2, 5, 6, 10 వార్డుల్లో సోమవారం రీపోలింగ్‌కు కలెక్టరు ఆదేశించారు. తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడి గ్రామంలో కూడా మేయర్ జేబీ శ్రీనివాస్, ఎమ్మెల్యే పులివర్తినానీని అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది.
అట్టుడికిన ‘వేటపాలెం’..
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మడలం బచ్చులవారిపాలెంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. బచ్చులవారిపాలెంలో పోలింగ్ కేంద్రంలో టీడీపీ, కాంగ్రెస్ వర్గాల ఏజెంట్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్, 200 మంది తన అనుచరులతో వచ్చి టీడీపీ మద్దతుదారులపై కర్రలు, రాళ్లతో దాడులు చేయడం ప్రారంభించారు. ప్రతిగా టీడీపీ వర్గీయులు రాళ్లు రువ్వారు. ఆమంచి వర్గీయులు బచ్చులవారిపాలెంపై విరుచుకుపడ్డారు. ఇళ్లల్లోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించారు. టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఇంటిలోకి వెళ్లి వీరంగం సృష్టించారు. ఆమె మూడేళ్ల కుమార్తెను గాల్లోకి ఎగురవేశారు. బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. వారిపై కూడా ఆమంచి వర్గీయులు దాడులకు తెగబడ్డారు. దీంతో డీఎస్పీ, సిబ్బంది గాయపడ్డారు. చేసేదేమీ లేక లాఠీచార్జితోపాటు డీఎస్పీ రెండు రౌండ్‌లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆమంచి వర్గీయుల దాడిలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!