ఆ పోలీసులపై చర్య తీసుకోండి
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:58 AM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, పక్షపాత వైఖరి ప్రదర్శించిన పల్నాడు, అన్నమయ్య జిల్లాల పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఎస్పీలకు ఆదేశాలిచ్చారు.
ఎన్నికలు, సాధారణ విధుల నుంచి తొలగించండి
విడదల రజని ఘటనలో పేట రూరల్ ఎస్ఐపై..ములకలచెరువు సీఐ, ఎస్‌ఐలపైనా చర్యలు: ఎస్ఈసీ
అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, పక్షపాత వైఖరి ప్రదర్శించిన పల్నాడు, అన్నమయ్య జిల్లాల పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఎస్పీలకు ఆదేశాలిచ్చారు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్లు దాఖలుకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ విచారణ జరిపి.. అక్కడి సీఐ కె.దస్తగిరి, సబ్ఇన్స్ప్క్టర్ పి.రామకృష్ణ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన ఎస్ఈసీ.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కర్నూలు రేంజ్ డీఐజీ, అన్నమయ్య జిల్లా ఎస్పీకి శనివారం లేఖ రాశారు.
వారిని తక్షణమే ఎన్నికలు, సాధారణ విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించారు. మాజీ మంత్రి విడదల రజని నివాసం వద్ద జరిగిన ఘటనపై కూడా ఎస్ఈసీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంకపై విచారణ చేపట్టి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది. విడదల రజనీని ఎస్ఐ ప్రియాంక తోసినట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎస్ఐ ప్రియాంకను ఎన్నికలు, సాధారణ విధుల నుంచి తక్షణమే రిలీవ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి: