Share News

బెజవాడలో ధర్నా .. వచ్చే నెల 26 నుంచి నిరవధిక సమ్మె

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:42 AM

వారానికి ఐదు రోజుల పనిదినాల అమలు, దీర్ఘకాలంగా ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం నేత వీఎస్ఆర్‌ శేఖర్‌ స్పష్టం చేశారు.

బెజవాడలో  ధర్నా .. వచ్చే నెల 26 నుంచి నిరవధిక సమ్మె

విజయవాడ (ధర్నాచౌక్‌): వారానికి ఐదు రోజుల పనిదినాల అమలు, దీర్ఘకాలంగా ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం నేత వీఎస్ఆర్‌ శేఖర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఏడు కార్మిక సంఘాలతో ఏర్పడిన యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా జరిగింది. బెఫీ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్‌, ఎస్‌బీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అమరావతి సర్కిల్‌ ప్రధాన కార్యదర్శి జి.కాశీవిశ్వనాథ్‌ మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మెలో పాల్గొంటామన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..

Updated Date - Sep 12 , 2026 | 04:42 AM