Share News

జగనొస్తే పీకేస్తారు!

ABN , Publish Date - Sep 22 , 2026 | 03:51 AM

జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ-2025పై దర్యాప్తు చేయిస్తారని వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్‌ ఎవరినీ వదలబోరని, దర్యాప్తులో అక్రమాలు బయటకు వచ్చిన వెంటనే డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులందరినీ పీకేస్తారని, ఉద్యోగాల్లో ఉంచబోరని చెప్పారు.

జగనొస్తే పీకేస్తారు!

  • ఎస్సీలో అక్రమాలు తేలిన వెంటనే ఎంపికైన టీచర్లందరినీ తొలగిస్తారు

  • ప్రమేయమున్న అధికారులపైనా చర్యలు

  • శాప్‌ కార్యాలయం వద్ద మా కార్యకర్తలపై ‘స్పోర్ట్స్‌’ టీచర్ల దాడి: సజ్జల

అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ-2025పై దర్యాప్తు చేయిస్తారని వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్‌ ఎవరినీ వదలబోరని, దర్యాప్తులో అక్రమాలు బయటకు వచ్చిన వెంటనే డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులందరినీ పీకేస్తారని, ఉద్యోగాల్లో ఉంచబోరని చెప్పారు. సోమవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. డీఎస్సీ అక్రమాల్లో మంత్రి లోకేశ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. తాము కోరుతున్నట్లుగా సీబీఐ దర్యాప్తును చంద్రబాబు కోరి ఉంటే బాగుండేదన్నారు. స్పోర్ట్స్‌ కోటాలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా కోరేందుకే తమ పార్టీ కార్యకర్తలు శాప్‌ కార్యాలయం వద్దకు వెళ్లారన్నారు.

తమ వారిని వెళ్లకుండా పోలీసులు అడ్డకున్నారని, అప్పటికే శాప్‌ కార్యాలయంలో ఉన్న స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయులు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలకు పోలీసులు లాఠీలు ఇచ్చి కొట్టించారన్నారు. డీఎస్సీ అక్రమాలతో ప్రమేయమున్న రెవెన్యూ, విద్య, శాప్‌, పోలీసు అధికారులెవరినీ జగన్‌ విడిచిపెట్టబోరని హెచ్చరించారు. డీఎస్సీ నిష్పాక్షికంగా జరిగితే ఈ పరీక్షలపై విమర్శలు చేసినందుకు జగన్‌ ప్రజల్లో చులకనైపోయేవారని అన్నారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా ప్రజా పోరాటాలు చేస్తామన్నారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 03:51 AM