కొనసాగుతున్న వర్షాలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:37 PM
జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా బుధవారం వర్షాలు కురిశాయి. ప్రధానంగా ఒడిశా రాష్ట్రానికి చేరువగా ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది.
జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీగా వాన
పాడేరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా బుధవారం వర్షాలు కురిశాయి. ప్రధానంగా ఒడిశా రాష్ట్రానికి చేరువగా ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న చింతూరు డివిజన్ పరిధిలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాడేరు, చింతూరు డివిజన్‌ల పరిధిలో గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: మండలంలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండకాసి మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. సుమారు గంట సేపు కురిసిన వర్షానికి జనం ఇబ్బందులు పడ్డారు.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండల పరిధిలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దఫదఫాలుగా వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక మోస్తరు వర్షం పడగా, సాయంత్రం కొద్ది సమయం భారీ వర్షం కురిసింది. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లోకి వరదనీరు ఇన్‌ఫ్లో ఎక్కువగా వస్తుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.