Share News

అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్‌ క్యూ బుక్‌ చేసుకోండి

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:50 AM

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు కేరళం పోలీసుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని డీజీపీ కార్యాలయం కోరింది.

అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్‌ క్యూ బుక్‌ చేసుకోండి

  • కేరళం పోలీసుల సూచనలకు అనుగుణంగా నడుచుకోండి

  • శబరిమల వెళ్లే భక్తులకు డీజీపీ ఆఫీస్‌ విజ్ఞప్తి

  • రోజుకు 80 వేల మందికే దర్శనానికి అనుమతి

  • నీలక్కల్‌లో స్పాట్‌ బుకింగ్‌ కేంద్రాల ఏర్పాటు

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు కేరళం పోలీసుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని డీజీపీ కార్యాలయం కోరింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘స్వామివారి దర్శనం కోసం ఆన్‌లైన్‌ వర్చువల్‌ క్యూ బుకింగ్‌ చేసుకోవడం తప్పనిసరి. భక్తుల రద్దీని నియంత్రించడం, తొక్కిసలాటకు అవకాశం లేకుండా సురక్షితంగా దర్శనం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

రోజుకు గరిష్ఠంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. గతంలో పంపా వద్ద ఉన్న రియల్‌ టైమ్‌ స్పాట్‌ బుకింగ్‌ కౌంటర్లను నీలక్కల్‌కు మార్చారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోలేని భక్తులు నీలక్కల్‌కు చేరుకుని స్పాట్‌ బుకింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాతే పంపాకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల ద్వారా రోజుకు గరిష్ఠంగా 10వేల మందికి అవకాశం కల్పించనున్నారు’ అని డీజీపీ కార్యాలయం వివరించింది.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 05:53 AM