శబరికి తీవ్ర వరద పోటు!
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:45 AM
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శబరి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. గురువారం రాత్రి ఎనిమిది గంటలకు చింతూరు వద్ద 31.5 అడుగులు మేర ప్రవహించిన ఈ నది, శుక్రవారం మధ్యాహ్నానికి 41.5 అడుగుల నీటి మట్టానికి చేరింది. ఛత్తీస్‌గఢ్...
గంటల వ్యవధిలోనే పది అడుగులకు పెరిగిన నదీ ప్రవాహం
చింతూరు వద్ద 41.5 అడుగుల నీటి మట్టం.. జల దిగ్బంధనంలో 50కి పైగా గ్రామాలు
చింతూరు, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శబరి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. గురువారం రాత్రి ఎనిమిది గంటలకు చింతూరు వద్ద 31.5 అడుగులు మేర ప్రవహించిన ఈ నది, శుక్రవారం మధ్యాహ్నానికి 41.5 అడుగుల నీటి మట్టానికి చేరింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో పడుతున్న వర్షాలు, సీలేరు జలాశయాల్లో ఫుల్ రిజర్వాయర్ లెవల్స్ (ఎఫ్‌ఆర్‌ఎల్) స్థాయికి చేరుకోవడాన్ని దృష్టిలో ఉంచుకుని జలాశయాల గేట్టు ఎత్తివేశారు. దీంతో ఆ నీరంతా శబరి, సీలేరు నదుల్లోకి చేరి ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. దీంతో చింతూరు మండలంలోని సోకిలేరు, కుయుగూరు, చంద్రవంక తదితర వాగుల్లోకి వరద నీరు చేరి ప్రధాన రహదార్లను మూసివేసింది. ఈక్రమంలో ఈ మండలంలో 50కి పైగా గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. రహదార్లపై వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంత వాసులు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ