Share News

తిరుపతి బస్టాండ్‌లో బస్సు చోరీ

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:25 AM

తిరుపతి ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండ్‌ ప్రాంగణంలో నిలిపి ఉంచిన అర్టీసీ అద్దె బస్సు చోరీకి గురైంది. ఈస్ట్‌ సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం..

తిరుపతి బస్టాండ్‌లో బస్సు చోరీ

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తిరుపతి ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండ్‌ ప్రాంగణంలో నిలిపి ఉంచిన అర్టీసీ అద్దె బస్సు చోరీకి గురైంది. ఈస్ట్‌ సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. విజయవాడ-తిరుపతి మార్గంలో అద్దె ప్రాతిపదికన నడుస్తున్న ఏపీ 39 యూఎక్స్‌ 9333 నంబరు బస్సు మంగళవారం సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు చేరుకుంది. బస్సును బస్టాండ్‌ ఆవరణలో పార్క్‌చేసిన డ్రెవర్‌, కండక్టర్‌ రెస్ట్‌ రూమ్‌లో సేదదీరారు.

వేకువజామున 3 గంటల సమయంలో డ్రైవర్‌ నాగేశ్వరరావు పార్క్‌ చేసిన ప్రాంతానికి వచ్చి చూడగా బస్సు కనిపించలేదు. దీంతో ఆయన విషయాన్ని ఆర్టీసీ అధికారులకు, బస్సు యజమానికి తెలియజేశారు. ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ఆచూకీ తెలిసిందని, నిందితులను గుర్తించినట్టు, త్వరలో బస్సును, నిందితులను ఆధీనంలోకి తీసుకుంటామని సీఐ వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 04:25 AM