Share News

విద్యుత్‌ శాఖకు రూ.500 కోట్ల నష్టం

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:27 AM

అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో విద్యుత్‌ శాఖకు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయి అంచనాల అనంతరం నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

విద్యుత్‌ శాఖకు రూ.500 కోట్ల నష్టం

అమరావతి/నరసాపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో విద్యుత్‌ శాఖకు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయి అంచనాల అనంతరం నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో సబ్‌స్టేషన్లు, విద్యుత్తు లైన్లు, స్తంభాలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 551 వరకు దెబ్బతిన్నాయని, 33 కేవీ ఫీడర్లు 519 దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దాదాపు 16 వేల కరెంటు స్తంభాలు నేలకొరిగాయని, కోనసీమ జిల్లాలో అత్యధికంగా 5వేలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4వేలు, మిగిలిన జిల్లాల్లో 7 వేలు చొప్పున స్తంభాలు దెబ్బతిన్నాయని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 05:27 AM