Share News

212 కోట్లతో లోక్‌భవన్‌

ABN , Publish Date - Sep 01 , 2026 | 04:42 AM

రాష్ట్ర రాజధాని అమరావతిలో గవర్నర్‌ అధికారిక నివాసం లోక్‌భవన్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.212.22 కోట్ల నిధులు విడుదల చేసింది.

212 కోట్లతో లోక్‌భవన్‌

అమరావతిలో నిర్మాణానికి నిధులు విడుదల

గవర్నర్‌ నివాసం, కార్యాలయం, అసెంబ్లీ దర్బార్‌

అదే కాంపౌండ్‌లో సిబ్బంది క్వార్టర్లు కూడా

ఏపీసీఆర్డీఏకు నిర్మాణ బాధ్యతలు

గుంటూరు(రాజధాని), ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతిలో గవర్నర్‌ అధికారిక నివాసం లోక్‌భవన్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.212.22 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందులో గవర్నర్‌ భవనం, అసెంబ్లీ దర్బార్‌ హాలు, గవర్నర్‌ కార్యాలయం, 2 అతిథి గృహాలు, 6 అధికారుల క్వార్టర్లు, 10 సీనియర్‌ సిబ్బంది క్వార్టర్లు, 12 జూనియర్‌ సిబ్బంది క్వార్టర్లు, 40 సహాయక సిబ్బంది క్వార్టర్లతోపాటు 144 బ్యారక్‌ వసతి సామర్థ్యంతో కూడిన బ్యారక్‌లు, 4 సెంటినల్‌ పోస్టులతో కూడిన సరిహద్దు రక్షణ (ప్రహరీ) గోడ ఉంటాయి. ఏపీసీఆర్డీఏ ఈ నిర్మాణాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించి 2025 అక్టోబరులోనే జీవో ఆర్‌టీ నంబర్‌ 1115 ద్వారా రాష్ట్ర పురపాలక శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

ఈ వార్తలను కూడా చదవండి

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..


పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 01 , 2026 | 04:43 AM