సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే రెండెకరాలిస్తా!
ABN , Publish Date - Nov 18 , 2026 | 02:06 AM
కాకినాడ జిల్లా రౌతులపూడి సర్పంచ్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.60 లక్షల విలువైన రెండెకరాల భూమిని గ్రామాభివృద్ధికి రాసిస్తానని...
రౌతులపూడి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా రౌతులపూడి సర్పంచ్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.60 లక్షల విలువైన రెండెకరాల భూమిని గ్రామాభివృద్ధికి రాసిస్తానని సర్పంచ్‌గా పోటీ చేస్తున్న చింతకాయల వెంకటసుబ్బలక్ష్మి ప్రకటించారు. మంగళవారం సాయంత్రం కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామ శివాలయం వద్ద భర్త శోభన్‌బాబు కృష్ణతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ అభివృద్ధికి వచ్చే నిధుల్లో అవినీతి జరుగుతోందని, ఏకగ్రీవంగా తనను ప్రకటిస్తే అవినీతి జరగకుండా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు