Share News

మదనపల్లి బాలిక హత్యాయత్నం కేసు.. రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ విచారణ..

ABN , Publish Date - Feb 17 , 2026 | 08:24 PM

మదనపల్లి బాలిక హత్యాయత్నం కేసు విచారణ గురించి తెలుసుకునేందుకు రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ మదనపల్లి చేరుకున్నారు. బాలిక హత్యకు సంబంధించిన విషయాల గురించి స్థానిక పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు.

మదనపల్లి బాలిక హత్యాయత్నం కేసు.. రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ విచారణ..
Rayalaseema DIG Koya Praveen

మదనపల్లి బాలిక హత్యాయత్నం కేసు విచారణ గురించి తెలుసుకునేందుకు రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ మదనపల్లి చేరుకున్నారు. బాలిక హత్యకు సంబంధించిన విషయాల గురించి స్థానిక పోలీసు అధికారులతో చర్చించారు. బాలికను హత్య చేసిన నిందితుడు పరారీలో ఉన్నట్టు డీఐజీ వెల్లడించారు. అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు (Madanapalle news).


మదనపల్లి ఆస్పత్రి దగ్గర బాలిక గ్రామానికి చెందిన వారు ఆందోళన చేపట్టారు (Rayalaseema DIG Koya Praveen). నిందితుడిని పట్టుకుని తగిన శిక్ష విధించాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అతి కష్టంపై బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టానికి తరలించారు. మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం కొనసాగుతోంది. పోస్టుమార్టం పూర్తి చేశాక మృతదేహాన్ని మరికొద్ది గంటల్లో బాలిక స్వగ్రామానికి తరలించే యోచనలో పోలీసులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

భర్తను అమ్మేసిన భార్య.. అతడి ప్రియురాలి దగ్గర్నుంచి ఎంత డబ్బు వసూలు చేసిందంటే..


లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

Updated Date - Feb 17 , 2026 | 09:43 PM