Share News

వైసీపీ పాపాలు పండే సమయం వచ్చింది

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:52 AM

వంద తప్పుల తర్వాత శిశుపాలుడి పాపం పండినట్టు వైసీపీ పాపాలు కూడా పండే సమయం దగ్గర పడిందని శాప్‌ చైర్మన్‌ రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

వైసీపీ పాపాలు పండే సమయం వచ్చింది

  • శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు మండిపాటు

తిరుపతి సిటీ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): వంద తప్పుల తర్వాత శిశుపాలుడి పాపం పండినట్టు వైసీపీ పాపాలు కూడా పండే సమయం దగ్గర పడిందని శాప్‌ చైర్మన్‌ రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ నేతలు శాంతియుత నిరసన పేరుతో రౌడీ, అల్లరి మూకలతో ఉపాధ్యాయులపై వీరంగం సృష్టించారు. వీరిలో ఎక్కువగా అసాంఘిక శక్తులు ఉన్నాయని పోలీసులు ఇచ్చిన గణాంకాలు చెబుతున్నాయి. తప్పుచేసిన వారందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. వీళ్ల బెదిరింపులకు భయపడేదిలేదు. మరో మూడు డీఎస్సీలు వేస్తామని మంత్రి లోకేశ్‌ చెప్పారు. నిరుద్యోగులూ సిద్ధం కండి’ అంటూ రవినాయుడు పిలుపునిచ్చారు.

ఈ వార్తలనూ చదవండి...

అదానీ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు..

మహిళల భద్రతకు ప్రాధాన్యం

Updated Date - Sep 25 , 2026 | 03:52 AM