Share News

నిలకడగా రాప్తాడు నిందితుడి ఆరోగ్యం

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:16 AM

రాప్తాడులో విద్యార్థినులపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడిచేసిన నిందితుడు హేమంత్‌కు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ ఐసీయూలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

నిలకడగా రాప్తాడు నిందితుడి ఆరోగ్యం

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాప్తాడులో విద్యార్థినులపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడిచేసిన నిందితుడు హేమంత్‌కు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ ఐసీయూలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జీజీహెచ్‌లో ఉండగా రెండు రోజుల క్రితం పల్మనరీ ఎంబాలిజం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో అతడినిశుక్రవారం రాత్రి 11:20 గంటలకు ప్రత్యేక పోలీసు భద్రత మధ్య అంబులెన్స్‌లో కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. వెంటనే వైద్యబృందం రోగిని పరిశీలించి పరీక్షలు నిర్వహించారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత అతడిని కార్డియాలజీ ఐసీయూకు తరలించారు. శనివారం ఉదయం కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు ఐసీయూలో హేమంత్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని చెప్పారు.

అనంతపురం నుంచి వచ్చినప్పుడు కొంత ఆయాసం ఉందని, ఇక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు. కార్డియాలజీ ఇన్‌చార్జి హెచ్‌వోడీ డాక్టర్‌ ప్రశాంత్‌ ఆధ్వర్యంలో రోగికి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ చెప్పారు. హేమంత్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని వైద్య బృందాన్ని ఆయన ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 04:16 AM