Share News

త్వరలో సమగ్ర క్యాన్సర్‌ వైద్యసేవలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:23 AM

క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి, నిర్ధారణతో పాటు మెడికల్‌, సర్జికల్‌, రేడియేషన్‌ ఆంకాలజీ వంటి సేవలను అందించడమే ప్రధాన లక్ష్యమని ఆస్టర్‌ రమేశ్‌ హాస్పిటల్‌ వ్యవస్థాపకుడు, ఎండీ పోతినేని రమేశ్‌బాబు తెలిపారు.

త్వరలో సమగ్ర క్యాన్సర్‌ వైద్యసేవలు

  • రమేశ్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ రమేశ్‌ బాబు

విజయవాడ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి, నిర్ధారణతో పాటు మెడికల్‌, సర్జికల్‌, రేడియేషన్‌ ఆంకాలజీ వంటి సేవలను అందించడమే ప్రధాన లక్ష్యమని ఆస్టర్‌ రమేశ్‌ హాస్పిటల్‌ వ్యవస్థాపకుడు, ఎండీ పోతినేని రమేశ్‌బాబు తెలిపారు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు నగరాలను అనుసంధానిస్తూ ఆస్టర్‌ రమేశ్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీని క్లస్టర్‌ స్థాయి నెట్‌వర్క్‌గా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూడు నెలల్లో గుంటూరులో సమగ్ర క్యాన్సర్‌ వైద్య సేవలను ప్రారంభిస్తామన్నారు. విజయవాడ, ఒంగోలులో వచ్చే ఏడాది ఆంకాలజీ సేవలను విస్తరించనున్నట్టు తెలిపారు. సమావేశంలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ రామమోహనరావు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 05:23 AM