కూటమిపై నమ్మకానికి నిదర్శనం: మాధవ్
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:42 AM
రాష్ట్రంలోని పట్టణ, పురపాలిక ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అభివర్ణించారు.
అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ, పురపాలిక ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం చేస్తోన్న కృషిని గుర్తించిన ప్రజలు బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులకు విజయాన్ని అందించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజ ల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం