Share News

కశ్మీర్‌ మాదే.. వైదొలగాల్సింది మీరే

ABN , Publish Date - Sep 19 , 2026 | 05:24 AM

‘కశ్మీర్‌ భారత్‌లో విలీనం కావడం పూర్తిగా చట్టబద్ధమైన ప్రక్రియ. ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎలాంటి వాదనలు చేసినా ఈ వాస్తవాన్ని మార్చలేరు. అక్రమంగా ఆక్రమించిన ప్రాంతం నుంచి పాకిస్థానే వైదొలగాలి’ అని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి అంతర్జాతీయ వేదికపై స్పష్టం చేశారు.

కశ్మీర్‌ మాదే.. వైదొలగాల్సింది మీరే

  • కామన్వెల్త్‌ సదస్సులో దాయాదికి ఎంపీ పురందేశ్వరి స్పష్టీకరణ

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘కశ్మీర్‌ భారత్‌లో విలీనం కావడం పూర్తిగా చట్టబద్ధమైన ప్రక్రియ. ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎలాంటి వాదనలు చేసినా ఈ వాస్తవాన్ని మార్చలేరు. అక్రమంగా ఆక్రమించిన ప్రాంతం నుంచి పాకిస్థానే వైదొలగాలి’ అని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి అంతర్జాతీయ వేదికపై స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతున్న 69వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ సదస్సులో మారుతున్న ప్రపంచ వ్యవస్థలో అంతర్జాతీయ చట్టం, ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ సహకారం, సమగ్ర అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆక్రమిత కశ్మీర్‌పై పాకిస్థాన్‌ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఎంపీ పురందేశ్వరి భారత గళం వినిపించారు. కామన్వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోనూ ఆమె తనదైన వాగ్ధాటితో భారతదేశ అభిప్రాయాలు, దృక్పథాలను సమర్థవంతంగా వినిపించారు.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 06:26 AM