అందుకే జగన్‌కు అడ్డుగా వెళ్ళాను.. దస్తగిరి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:05 PM
ఎన్నికల వేళ పులివెందులలో చోటుచేసుకున్న మరో ఘటన చర్చనీయాంశంగా మారింది. జగన్ ర్యాలీ వద్ద వివేకా హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నించిన దస్తగిరిపై దాడి జరిగినట్లు సమాచారం.
కడప, నవంబర్ 1: పులివెందులలో జగన్ ర్యాలీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్‌ను ప్రశ్నించిన దస్తగిరిపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దస్తగిరి మట్లాడుతూ.. జగన్‌కు ఎందుకు ఓటు వేయాలని అడిగేందుకే తాను వెళ్లానని.. ప్రశ్నించినందుకు వైసీపీ శ్రేణులు తనపై దాడికి పాల్పడ్డాయన్నారు. జగన్ పాలనలో అన్నీ అరాచకాలేనని విమర్శించారు.
జగన్‌కు ఎందుకు ఓటు వేయాలని అడిగితే దాడి చేస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా? అని నిలదీశారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకే తనపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం.. అని దస్తగిరి ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన దస్తగిరి.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని, ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!