గర్భిణిని రక్షించిన అధికారులు
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:50 AM
భారీ వర్షాలతో ముంపు చుట్టుముట్టడంతో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం అన్నవరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఈ పరిస్థితుల్లో గ్రామానికి చెందిన 9 నెలల గర్భిణి భూమికను అధికారులు అతికష్టం మీద రక్షించారు.
భారీ వర్షాలతో ముంపు చుట్టుముట్టడంతో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం అన్నవరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఈ పరిస్థితుల్లో గ్రామానికి చెందిన 9 నెలల గర్భిణి భూమికను అధికారులు అతికష్టం మీద రక్షించారు. సబ్ కలెక్టర్, డీఎస్పీ ఆమె ఇంటికి బోటులో చేరుకుని.. ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ఆమెను కొంతదూరం బోటులో.. అక్కడినుంచి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అదే గ్రామానికి చెందిన డయాలసిస్ రోగిని కూడా ఇదే తరహాలో ఆస్పత్రికి తెచ్చారు. పాలకొండ వెంకటరమణ కాలనీలోని వరదలో చిక్కుకున్న 20 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా గాదరాడలో కారు కాలువలో కొట్టుకుపోయింది. స్థానికులు స్పందించి అందులోని వారిని బయటకులాగారు. దేవరపల్లి మండలం యాదవోలులో చుక్కల జింక ఊరిలోకి రాగా, గ్రామస్థులు అధికారులకు అప్పగించారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ