Share News

గత ఏడాదికన్నా 20 శాతం అధిక డిమాండ్‌

ABN , Publish Date - Sep 18 , 2026 | 03:44 AM

ఎల్‌నినో ప్రభావం విద్యుత్తు శాఖపై తీవ్రంగా ఉంది. మరోవైపు విద్యుత్తు డిమాండు గత ఏడాది కన్నా 20 శాతం అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నాం’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. గురువారం విద్యుత్తు ఉత్పత్తి, సరఫరాపై ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

గత ఏడాదికన్నా 20 శాతం అధిక డిమాండ్‌

  • అయినా నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా

  • సోలార్‌ బ్యాటరీ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు ప్రోత్సాహం

  • 5500 మెగావాట్ల ఉత్పత్తే లక్ష్యం

  • సమీక్షలో మంత్రి గొట్టిపాటి

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం విద్యుత్తు శాఖపై తీవ్రంగా ఉంది. మరోవైపు విద్యుత్తు డిమాండు గత ఏడాది కన్నా 20 శాతం అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నాం’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. గురువారం విద్యుత్తు ఉత్పత్తి, సరఫరాపై ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణం వేసవిని తలపిస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి 240 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంటే ప్రస్తుతం అది 290 మిలియన్‌ యూనిట్లు వరకు ఉంటోంది. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. వర్షాలు లేకపోవడంతో హైడల్‌ విద్యుత్తు పూర్తిగా జీరో అయింది. పగటిపూట సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి చేసి బ్యాటరీల్లో స్టోర్‌ చేసుకుని పీక్‌ అవర్స్‌లో వాడుకోవాలనే ఆలోచనతో బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నాం. భవిష్యత్తు డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని 5500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 03:44 AM