జగన్, అవినాశ్‌రెడ్డిలపై కేసు
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:29 AM
కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో జగన్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఆదివారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జగన్ బెంగళూరు నుంచి పులివెందులకు వచ్చారు.
ఐదు సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్ పులివెందుల డీఎస్పీ వెల్లడి
పులివెందుల, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో జగన్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఆదివారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జగన్ బెంగళూరు నుంచి పులివెందులకు వచ్చారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా వాహనాల్లో ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పెద్దఎత్తున జనాలను సమీకరించి ధర్నా చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి 144 సెక్షన్ అమలులో ఉండగా జనసమీకరణ చేసి ఆందోళన చేయడం చట్టరీత్యా నేరం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జగన్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మురళీనాయక్ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఎన్నికల అధికారి రఫిక్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నంబర్ 196/2026తో సెక్షన్లు 189, 223, 126(2)ఆర్/డబ్ల్యూ, 190 బీఎన్‌ఎస్ యాక్ట్, 126(1) కింద కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. జగన్‌తో పాటు ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఎంపీ పీఏ లోకేశ్, మాజీ కౌన్సిలర్ కాళ్ల భాస్కర్, అంజనప్ప, చంటి, రాయుడు సహా 85 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం