Share News

బతికినంత కాలం జైలులోనే!

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:13 AM

ఎనిమిదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి, ఆపై హత్యచేసిన యువకుడికి బతికినంత కాలం (జీవిత కాలం) జైలుశిక్ష విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పుచెప్పింది. వివరాలిలా ఉన్నాయి.

బతికినంత కాలం జైలులోనే!

  • బాలుడిపై లైంగిక దాడి, హత్య కేసులో యువకుడికి పోక్సో కోర్టు శిక్ష

  • బాధిత తల్లిదండ్రులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశం

చిత్తూరు లీగల్‌/పీలేరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి, ఆపై హత్యచేసిన యువకుడికి బతికినంత కాలం (జీవిత కాలం) జైలుశిక్ష విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పుచెప్పింది. వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కేవీ పల్లె పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎనిమిదేళ్ల బాలుడు కనిపించలేదని 2021 అక్టోబరు 12 న కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజు గ్రామ సమీపంలోని బొప్పాయి గార్డెన్‌లో ఆ బాలుడి మృతదేహం బయటపడింది. నందకుమార్‌ రెడ్డి అలియాస్‌ ఉదయ్‌ అనే యువకుడు ఆ బాలుడికి మాయమాటలు చెప్పి, సమీపంలోని తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఆ బాలుడిని గొంతుకు టవల్‌ బిగించి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద అప్పటి మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం పోక్సో కోర్టులో విచారణ జరగగా స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మోహనకుమారి వాదించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి బతికినంత కాలం జైలుశిక్ష.. రూ.11 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇన్‌చార్జి న్యాయాధికారి, జిల్లా ప్రధాన న్యాయాధికారి అరుణ సారిక తీర్పు చెప్పారు. బాలుడి తల్లిదండ్రులకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 05:13 AM