Share News

50 ఏళ్లు నిండిన చేనేతలకు పింఛన్లు

ABN , Publish Date - Sep 20 , 2026 | 04:35 AM

అర్హత ఉండి, 50 ఏళ్లు నిం డిన చేనేత కార్మికులందరికీ ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సవిత తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయం నుంచి చేనేత జౌళిశాఖ అధికారులతో శనివారం ఆమె జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు.

50 ఏళ్లు నిండిన చేనేతలకు పింఛన్లు

  • అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి సవిత

  • శ్రీసత్యసాయి జిల్లాలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

హిందూపురం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): అర్హత ఉండి, 50 ఏళ్లు నిం డిన చేనేత కార్మికులందరికీ ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సవిత తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయం నుంచి చేనేత జౌళిశాఖ అధికారులతో శనివారం ఆమె జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని కొన్నిచోట్ల చేనేత కార్మికుల దరఖాస్తుల పరిశీలనలో జరుగుతున్న చేతివాటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పరిశీలన పేరుతో కాసులకు కక్కుర్తి పడితే సహించేది లేదన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా చేనేత పింఛన్ల కోసం 16,521 దరఖాస్తులు వచ్చినట్లు ఆశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సిసోడియా మంత్రికి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84 వేలమందికిపైగా చేనేత కార్మికులకు పింఛన్లు అందజేస్తున్నామని వివరించారు. కాగా, చేనేత పింఛన్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో చేనేత జౌళిశాఖ ధర్మవరం డీవో రమణారెడ్డి, ఏడీవో సీనానాయక్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆ శాఖ కమిషనర్‌ రేఖారాణి శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

ఈ వార్తలనూ చదవండి...

విశాఖకు గోదావరి జలాలు

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిధి పెంపు

Updated Date - Sep 20 , 2026 | 04:35 AM