Share News

ప్రజలకు చేసిన మేలే గెలిపించింది: పెమ్మసాని

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:37 AM

ప్రజలకు చేసిన మేలే స్థానిక ఎన్నికల్లో కూటమికి ఘన విజయాన్ని అందించిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘2021లో అరాచకాలు, అక్రమ కేసులతో వైసీపీ అధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది.

ప్రజలకు చేసిన మేలే గెలిపించింది: పెమ్మసాని

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రజలకు చేసిన మేలే స్థానిక ఎన్నికల్లో కూటమికి ఘన విజయాన్ని అందించిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘2021లో అరాచకాలు, అక్రమ కేసులతో వైసీపీ అధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. పులివెందుల, పుంగనూరు, మాచర్ల వంటి ప్రాంతాల్లో 2021లో టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి, కూటమికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. ఈవీఎంలైనా, బ్యాలెట్‌ పేపర్లయినా కూటమిపైనే ప్రజలు తమ నమ్మకాన్ని ఉంచారు.’ అని పెమ్మసాని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 01:37 AM