Share News

మహిళల ద్రోహి జగన్‌: పీతల సుజాత

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:10 AM

ఎన్నికల ముందు మేనమామనంటూ ప్రగల్భాలు పలికిన జగన్‌ ఇప్పుడు కంస మామలా మారి సొంత మేనకోడలి పెళ్లిని అడ్డుకుంటున్నారని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్‌ చైర్మన్‌ పీతల సుజాత విమర్శించారు.

మహిళల ద్రోహి జగన్‌: పీతల సుజాత

అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు మేనమామనంటూ ప్రగల్భాలు పలికిన జగన్‌ ఇప్పుడు కంస మామలా మారి సొంత మేనకోడలి పెళ్లిని అడ్డుకుంటున్నారని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్‌ చైర్మన్‌ పీతల సుజాత విమర్శించారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించి చరిత్రలో నిలిచిపోతే, జగన్‌ మహిళల ఆస్తిహక్కును కాలరాస్తూ చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. తల్లికి, చెల్లికి, ఈ రాష్ట్ర మహిళలకు జగన్‌ ఎలాంటి న్యాయమూ చేయలేదని, రాష్ట్ర చరిత్రలో మహిళా ద్రోహిగా జగన్‌ పేరు మిగిలిపోతుందని విమర్శించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 06:10 AM