మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Sep 13 , 2026 | 07:29 PM
వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణహితంగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సంప్రదాయబద్ధంగా మట్టి వినాయకుడిని పూజించి, ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన సూచించారు.
అమరావతి, సెప్టెంబర్ 13: వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. దేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని దైవ స్వరూపంగా భావించి.. నదులు, వృక్షాలు, పర్వతాలు, జీవరాశులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని పేర్కొన్నారు. తొలి పూజలందుకునే వినాయకుడి అర్చనలో ఉపయోగించే పత్రి, పుష్పాలు వృక్ష సంపదతో, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని చాటుతాయని అన్నారు.
పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు..
వినాయకచవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సంప్రదాయబద్ధంగా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని సూచించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ
విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు..
For More AP News And Telugu News