అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకుందాం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:13 AM
అడవులు, వన్యప్రాణులు, ప్రకృతి సంపద పరిరక్షణకు అత్యున్నత త్యాగాలు చేసిన అటవీ సిబ్బంది అందరికీ స్ఫూర్తిదాయమని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవ సందర్భంగా అటవీ అమరవీరులకు ఆయన ఘన నివాళ్లు అర్పించారు.
అమరావతి, సెప్టెంబర్ 11: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవ సందర్భంగా అటవీ అమరవీరులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ సిబ్బంది చేసిన త్యాగాలను ఆయన కొనియాడారు. 1939 నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 మంది అటవీ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని పవన్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘అటవీ అమరవీరుల త్యాగాలు ఎంతో గొప్పవి. వారి స్ఫూర్తిని భావితరాలకు అందిస్తాం. అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం. అందుకోసం‘సంజీవని’ పేరుతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైళ్లన్నీ కిటకిట.. వరుస సెలవులతో సొంతూరు బాటపట్టిన జనం
మెగా డీఎస్సీపై జగన్ విషం కక్కడం బాధాకరం: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana New