Share News

ఏనుగు మృతి ఘటనపై పవన్‌ సీరియస్‌

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:28 AM

చిత్తూరు జిల్లా గుబ్బలవారిపల్లి సమీపంలో కరెంట్‌ షాక్‌తో మగ ఏనుగు మృతి చెందిన ఘటనను డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ తీవ్రంగా పరిగణించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

ఏనుగు మృతి ఘటనపై పవన్‌ సీరియస్‌

  • అక్రమ విద్యుత్‌ ఫెన్సింగ్‌లపై చర్యలకు ఆదేశాలు

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా గుబ్బలవారిపల్లి సమీపంలో కరెంట్‌ షాక్‌తో మగ ఏనుగు మృతి చెందిన ఘటనను డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ తీవ్రంగా పరిగణించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో కరెంటు వైర్లు ఉండటంపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. ఉద్దేశపూర్వకంగా వైర్లు వేసి ఉంటే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. పంటల సంరక్షణ పేరుతో అటవీ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా కరెంట్‌ ఫెన్సింగ్‌లు ఏర్పాటుచేస్తే.. అలాంటి వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 05:28 AM