Share News

తుఫాన్ బాధితులకు అండగా నిలవండి.. జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు

ABN , Publish Date - Oct 28 , 2026 | 01:14 PM

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలవాలని జనసేన కార్యకర్తలకు.. ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

తుఫాన్ బాధితులకు అండగా నిలవండి.. జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు
Pawan Kalyan

అమరావతి, అక్టోబర్ 28: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలవాలని జనసేన కార్యకర్తలకు.. ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అండగా ఉండాలని, వారికి అవసరమైన సాయం అందించేందుకు జనసేన శ్రేణులు ముందుకు రావాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు, బాధితులకు అవసరమైన సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.


తుఫాన్ కారణంగా ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులకు ఆహారం, అవసరమైన సహాయాన్ని అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న సహాయక చర్యల్లో జనసేన కార్యకర్తలు భాగస్వాములు కావాలని కోరారు. అధికారులు, సహాయక సిబ్బందికి సహకరిస్తూ బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందేలా చూడాలని తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, అవసరమైన చోట సహాయక చర్యలకు తోడ్పడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. సీసీ కెమెరాలతో పరిస్థితుల పరిశీలన

చూసినా.. షేర్ చేసినా.. కటకటాలపాలే..

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 28 , 2026 | 02:46 PM