Share News

జగన్‌ విధ్వంసాన్ని జనం మర్చిపోలేదు: పల్లా

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:35 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే ప్రజలు పట్టం కట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

జగన్‌ విధ్వంసాన్ని జనం మర్చిపోలేదు: పల్లా

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే ప్రజలు పట్టం కట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కార్యకర్తల కష్టానికి, కూటమి నాయకత్వంపై ప్రజలకున్న అచంచల విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనం. జగన్‌ చేసిన విధ్వంస పాలనను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు.

2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్‌ వైఖరిలో మార్పు రాలేదు. అందుకే స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు మరోసారి జగన్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు. కూటమి పార్టీల ఐక్యతతోనే ఈ భారీ విజయం సాధ్యమైంది. ప్రజలు ఇచ్చిన ఈ విజయంతో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగింది’ అని పల్లా అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 01:35 AM