Share News

'ఆపరేషన్ చిన్నారి తల్లి'పై హోం మంత్రి అనిత ప్రశంసలు

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:23 AM

ఏపీలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నెల్లూరు జిల్లా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమంపై రాష్ట్ర హోం మంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు.

'ఆపరేషన్ చిన్నారి తల్లి'పై హోం మంత్రి అనిత ప్రశంసలు
Operation Chinnari Thalli

నెల్లూరు, మార్చి30: ఏపీలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నెల్లూరు జిల్లా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా పోలీసుల పనితీరును ఆమె ప్రత్యేకంగా కొనియాడారు. జిల్లాలో మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను ఆమె స్వయంగా పరిశీలించి, అధికారులను అభినందించారు.


ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. ‘మహిళలకు ముప్పు పొంచి ఉండే ప్రాంతాలను గుర్తించి, జిల్లా వ్యాప్తంగా 118 హాట్ స్పాట్‌లను పోలీసులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించడానికి 7 ప్రత్యేక శక్తి టీమ్‌లు, 5,572 శక్తి వారియర్ గ్రూపులు అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించడానికి సిద్ధంగా ఉంటాయి. విద్యార్థినులు తమను తాము కాపాడుకునేలా 3,348 విద్యాసంస్థల్లో ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వడం గొప్ప విషయం. 60 రోజుల్లో చార్జ్‌షీట్లు దాఖలు చేసి, 546 మంది POCSO నిందితులకు శిక్ష పడేలా చేసిన పోలీసుల కృషిని అభినందిస్తున్నా. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ 'శక్తి యాప్' ద్వారా 112 సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఏదైనా ఆపద కలిగితే కేవలం ఒక్క క్లిక్‌తో పోలీసు సాయం పొందేలా ఈ యాప్‌ను రూపొందించడం గొప్ప విషయం’ అని అన్నారు.


పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు:

హోం మంత్రి అనిత విజయనగరం జిల్లాలో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ యంత్రాంగం పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానిక సబ్ జైలు, విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా ఉన్నారు. స్టేషన్ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల పనితీరును మంత్రి స్వయంగా చెక్ చేశారు. భద్రతాపరంగా నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని ఆమె అధికారులకు స్పష్టం చేశారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన ‘శక్తి టీమ్స్’ క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తున్నాయో పోలీసులను అడిగి తెలుసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలి: విద్యాసాగర్‌

కరువు మండలాల విద్యార్థులకు డ్రై రేషన్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 30 , 2026 | 01:24 PM