‘రికార్డు’ స్థాయిలో చెత్త సేకరణ!
ABN , Publish Date - Sep 20 , 2026 | 04:58 AM
ఒంగోలు నగరంలో శనివారం నిర్వహించిన భారీ వ్యర్థాల విభజన ప్రత్యేక కార్యక్రమం (మెగా సెగ్రిగేషన్ డ్రైవ్) ‘రికార్డు’ స్థాయిలో సాగింది. ఇళ్ల నుంచి వచ్చే తడి, పొడిచెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో దీనిని నిర్వహించగా..
ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ సక్సెస్
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు
ఒంగోలు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగరంలో శనివారం నిర్వహించిన భారీ వ్యర్థాల విభజన ప్రత్యేక కార్యక్రమం (మెగా సెగ్రిగేషన్ డ్రైవ్) ‘రికార్డు’ స్థాయిలో సాగింది. ఇళ్ల నుంచి వచ్చే తడి, పొడిచెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో దీనిని నిర్వహించగా.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదైంది. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి ఈ నెలాఖరుకు 150 ఏళ్లు పూర్తికావస్తుండగా 3 మాసాలుగా స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కార్పొరేషన్ స్పెషలాఫీసర్, కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో విభిన్న కార్యక్రమా లు సాగుతున్నాయి. గత ఆదివారం ఒకే రోజు 150 ప్రాంతాల్లో మెగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
శనివారం మెగా సెగ్రిగేషన్ డ్రైవ్‌ను నిర్వహించారు. నగర పరిధిలో 80వేలకు పైగా గృహాలు, వ్యాపార, విద్య ఇతరత్రా సంస్థలన్నింటి నుంచి ఒకేసమయంలో తడి, పొడి చెత్తలను సేకరించారు. ముందుగా మున్సిపల్ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికీ తెలుపు, నలుపు కవర్లు పంపిణీ చేసి తడి, పొడి చెత్తలను వాటిలో వేసేలా ప్రజలకు సూచనలు చేశారు. శనివారం ఉదయం 8 నుంచి 9గంటల మధ్య ఒక నగరం-ఒక గంట పేరుతో ఆ చెత్త సేకరణ చేపట్టారు. మూడు వేల మందికి పైగా సిబ్బంది ఈ చెత్త సేకరణలో పాల్గొన్నారు. కాగా, నగరంలో ఒకే రోజు కొద్దిగంటల వ్యవధిలో విడివిడిగా తడి, పొడి చెత్త సేకరణ చేయడాన్ని వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ బుక్స్‌లో నమోదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు