అమరావతిలో ఒబెరాయ్ ఫైవ్‌స్టార్ హోటల్
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:08 AM
రాజధాని అమరావతిలో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ ఏర్పాటుకు సంబంధించి ఏపీసీఆర్డీఏ, ఈఐహెచ్ లిమిటెడ్ (ఒబెరాయ్ హోటల్స్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
రూ. 174 కోట్లతో నిర్మాణం.. 400 మందికి ఉపాధి
తుళ్లూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ ఏర్పాటుకు సంబంధించి ఏపీసీఆర్డీఏ, ఈఐహెచ్ లిమిటెడ్ (ఒబెరాయ్ హోటల్స్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. విశాఖపట్నంలో శుక్రవారం సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు సమక్షంలో ఏపీ సీఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు, ఈఐహెచ్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. రూ. 174 కోట్లతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యక్షంగా 150 మందికి, పరోక్షంగా 250 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఎంవోయూ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, పి.నారాయణ, బీసీ జనార్దన్‌రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, సీఆర్డీఏ అదనపు కమిషనర్ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్