Share News

ఎన్టీఆర్ జిల్లా అడవుల్లో నాలుగు రోజులుగా పెద్దపులి.. పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్

ABN , Publish Date - Nov 24 , 2026 | 09:55 AM

ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గంపలగూడెం మండలం కనుమూరు అటవీ ప్రాంతంలో నాలుగు రోజులుగా మకాం వేసిన పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో ఎక్స్‌ప్లోరర్ టైగర్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా అడవుల్లో నాలుగు రోజులుగా పెద్దపులి.. పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్
Tiger Operation

ఎన్టీఆర్, నవంబరు 24: జిల్లాలో పెద్దపులి పట్టుబడకపోవడంతో అటవీశాఖ అధికారులు ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. గంపలగూడెం మండలం కనుమూరు అటవీ ప్రాంతంలో నాలుగు రోజులుగా పెద్దపులి సంచరిస్తుండటంతో అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పులి కదలికలను ట్రాకర్ సాయంతో ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, అది ఉన్న ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులిని ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.


పెద్దపులిని పట్టుకునే ఆపరేషన్‌లో పూణేకు చెందిన నిపుణులు, ప్రత్యేక సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు. పులి కదలికలను గమనిస్తూ దానికి ఎలాంటి హాని కలగకుండా బంధించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. మరోవైపు పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఏ. కుమార్ సూచించారు. అటవీ ప్రాంతాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

నిమ్స్‌లో అడుగడుగునా అవినీతి

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 24 , 2026 | 10:52 AM