తిరుమల నడక మార్గంలో ఎన్‌ఆర్‌ఐ మృతి
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:14 AM
తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళుతున్న ఓ ఎన్‌ఆర్‌ఐ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు.
చంద్రగిరి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళుతున్న ఓ ఎన్‌ఆర్‌ఐ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. అమెరికాలోని బోర్డెన్ టౌన్‌లో నివసిస్తున్న సింగిరెడ్డి సుర్‌జిత్‌రెడ్డి(53) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు బయల్దేరారు. మంగళవారం సాయంత్రం చంద్రగిరి మండలంలోని శ్రీవారిమెట్టు మార్గంలో నడిచి వెళుతుండగా 800వ మెట్టు వద్ద గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఆయన మృతదేహాన్ని శ్రీవారి మెట్టు కింద భాగంలోకి తీసుకొచ్చి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం