వివాహ సందడిలోనూ.. ఓటు మరువలేదు
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:40 AM
నవ వధూవరులు ఓటు హక్కు వినియోగించుకుని తమ బాధ్యతను నెరవేర్చిన ఘటనలు ఇవి. చిత్తూరు రూరల్ మండలంలోని కుర్చివేడు గ్రామానికి చెందిన రమ్యకు గురువారం ఉదయమే వివాహం జరిగింది.
నవ వధూవరులు ఓటు హక్కు వినియోగించుకుని తమ బాధ్యతను నెరవేర్చిన ఘటనలు ఇవి. చిత్తూరు రూరల్ మండలంలోని కుర్చివేడు గ్రామానికి చెందిన రమ్యకు గురువారం ఉదయమే వివాహం జరిగింది. అయినప్పటికీ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుశేనాపురం గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌కు గురువారమే వివాహమైంది. తాళికట్టిన మరుక్షణమే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి మళ్లీ వివాహ ఫంక్షన్‌కు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మాకనపల్లికి చెందిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కుత్తుమ మాధవరావు కుమార్తె మానసకు, పల్లిసారధి గ్రామానికి చెందిన రెయ్యి మౌళితో గురువారమే వివాహం. అయినప్పటికీ మానస మాకనపల్లిలో, మౌళి పల్లిసారధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పెళ్లి హడావుడిలోనూ సామాజిక బాధ్యతను నిర్వర్తించిన ఈ జంటను పలువురు అభినందించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రాయలపురం గ్రామానికి చెందిన వంశీకి గురువారం ఉదయమే చంద్రగిరిలో వివాహమైంది. అయినప్పటికీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో పట్టుబట్టలతోనే రాయలపురం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు.
- చిత్తూరు రూరల్, ఓర్వకల్లు, పలాస, చంద్రగిరి- ఆంధ్రజ్యోతి
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ