ఎత్తిపోతల జలపాతానికి సరికొత్త హంగులు
ABN , Publish Date - Sep 08 , 2026 | 06:49 AM
పల్నాడు ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఎత్తిపోతల జలపాతానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించే జిప్ లైన్, జిప్ సైకిల్ కార్యకలాపాలను ఏపీటీడీసీ ఏర్పాటు చేసింది.
జిప్ లైన్, జిప్ సైకిలింగ్‌తో రోమాంచిత అనుభూతి
1.71 కోట్లతో ఏర్పాటు... 9న ప్రారంభం
మాచర్ల, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): పల్నాడు ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఎత్తిపోతల జలపాతానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించే జిప్ లైన్, జిప్ సైకిల్ కార్యకలాపాలను ఏపీటీడీసీ ఏర్పాటు చేసింది. రెయిన్‌బో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో పర్యాటకశాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ అడ్వెంచర్ కార్యకలాపాలు ఎత్తిపోతలను మరింత ఆకర్షణీయమైన కుటుంబ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో కీలక అడుగుగా నిలవనున్నాయి. జిప్ లైన్ ద్వారా ఎత్తు నుంచి ప్రయాణిస్తూ 100 అడుగుల లోతులో ఉన్న ఎత్తిపోతల పరిసరాల ప్రకృతి అందాలను పర్యాటకులు ఆస్వాదిస్తారు. జిప్ సైకిల్‌పై ప్రయాణం సరికొత్త సాహసోపేత, రోమాంచిత అనుభూతిని ఇస్తుంది. ఈ రెంటి ఏర్పాటులోనూ పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. నాణ్యమైన పరికరాలు, అవసరమైన భద్రతా ఏర్పాట్లు, శిక్షణ పొందిన సిబ్బందితో నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.1.71 కోట్ల పెట్టుబడి పెట్టామని, 9న ప్రారంభించనున్నామని రెయిన్‌బో ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతినిధులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి