నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం.. తప్పిన భారీ ప్రాణనష్టం
ABN , Publish Date - Apr 05 , 2026 | 04:55 PM
నెల్లూరు జిల్లా సంగం సమీపంలోని బీరాపేరు బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. బస్ డ్రైవర్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
సంగం, ఏప్రిల్ 5: నెల్లూరు జిల్లా సంగం సమీపంలోని బీరాపేరు బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. అతి వేగంగా వచ్చిన సిమెంట్ ట్యాంకర్ (లారీ) వరుసగా వాహనాలను ఢీ కొట్టడంతో జాతీయ రహదారిపై ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాదంతో గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరాపేరు బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్, ఒక బైక్‌ను వెనుక నుంచి వచ్చిన సిమెంట్ ట్యాంకర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ధాటికి బైక్ నేరుగా బస్సు కిందకు దూసుకుపోయింది. బైక్ బస్సు కింద ఇరుక్కుపోయినప్పటికీ, బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. బైక్ పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులకు ఏ ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుతో జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి
టెర్రర్ లింక్స్ కేసు.. కేసులో బలం లేదన్న నిందితుల తరఫు న్యాయవాది..
మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న